రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ నగదు బదిలీ పథకాల ద్వారా నిధులు దారి మళ్లాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం తెలిపింది. సోషల్ ఆడిట్ సహా, పారదర్శక విధానాల్లో లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ స్పష్టం చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏటా కొనసాగుతుందని దీనికి దురుద్దేశాలను ఆపాదించటం సరికాదని వెల్లడించింది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుందని స్పష్టం చేసింది. లబ్దిదారుల జాబితాను కూడా సామాజిక ఆడిట్ కోసం గ్రామ సచివాలయాల్లో ఉంచుతున్నామని.. అభ్యంతరాలను స్వీకరించిన అనంతరమే తుది జాబితా ఖరారు అవుతుందని తెలిపింది. అర్హతల వర్తింపులో ఒక ఏడాదిలో అర్హుడైన వ్యక్తి మరుసటి సంవత్సరానికి అనర్హుడుగా మారే అవకాశముందని గ్రామ వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదికలో పేర్లు బయటపెట్టాలి: ఎంపీ రఘురామ