ETV Bharat / city

GVL on Budget: భారత అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్​: జీవీఎల్​ - gvl comments on budget issue

GVL respond on Budget: దేశ అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్​ ఉందని భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్​లో ప్రాధాన్యత లేదని పాత పాటే పాడుతున్నారని.. ఏపీకి సుమారు రూ.10 వేల కోట్ల నిధులు వచ్చే అవకాశముందని తెలిపారు. అంకెలతో అవాస్తవాలు ప్రచారం చేసి మభ్యపెట్టొద్దని ఆయన హెచ్చరించారు.

gvl on budget issue
gvl on budget issue
author img

By

Published : Feb 2, 2022, 12:33 PM IST

దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్​ను కేంద్రం రూపొందించిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. భారత అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణం వేగవంతం కానున్నాయని.. నిర్మాణాలకు రూ.80 వేల కోట్ల నిధుల పెంచారని చెప్పారు. బడ్జెట్​లో పథకాలు తగ్గించి రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరిగేలా చూశారని ఆయన పేర్కొన్నారు.

"తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్​లో ప్రాధాన్యత లేదని పాత పాట పాడుతున్నారు. అది కేంద్ర బడ్జెట్​.... ఏ రాష్ట్ర ప్రస్తావన లేదు. అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలును మభ్యపెటొద్దు. రైతులపై ఎరువుల భారం వేసే ఆలోచన కేంద్రానికి లేదు. ఏపీ, తెలంగాణ ఫుడ్​ సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల సేకరణకు ఆహరం సబ్సిడీ కేటాయింపులు పెంచింది. ఏపీకు సుమారు రూ.10 వేల కోట్లు నిధులు వచ్చే అవకాశం ఉంది" - జీవీఎల్​ నరసింహారావు, రాజ్యసభ ఎంపీ

కేంద్రాన్ని విమర్శించే ముందు కేసీఆర్​ తాను ముందు ఏం చేశారో తెలుసుకోవాలని జీవీఎల్​ నరసింహారావు సూచించారు. ఆరోగ్య రంగంలో ​ఏం చేశారో ఒక్కసారి కేసీఆర్​ సమీక్షించుకోవాలన్నారు.

ఇదీ చదవండి-

ఉద్యోగుల 'చలో విజయవాడ'కు ఆంక్షలు.. ముందస్తు అరెస్టులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.