ETV Bharat / city

ఈనెల 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్: ఏపీపీఎస్సీ - ఏపీపీఎస్సీ వార్తలు

గ్రూప్ -1 మెయిన్స్ పై ఏపీపీఎస్సీ మరోసారి స్పష్టతనిచ్చింది. ఈనెల 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులు తప్పకుండా హాల్ టిక్కెట్లు, గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించింది.

appsc
appsc
author img

By

Published : Dec 12, 2020, 8:43 PM IST

ఈనెల 14 నుంచి 20 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఏపీపీఎస్సీ తెలిపింది. 9,679 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉదయం 8.45-9.30 మధ్య పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని వివరించింది. అభ్యర్థులు హాల్ టికెట్‌, గుర్తింపు కార్డు తప్పక తీసుకురావాలని స్పష్టం చేసింది. విజయవాడ కమిషన్ కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సమాచారం కోసం 0866-2527820, 821, 0866-2527819 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమాచారం పొందవచ్చని సూచించింది.

ఇదీ చదవండి

ఏపీపీఎస్సీ వైఖరిపై హైదరాబాద్​లో గ్రూప్-1 అభ్యర్థుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.