కొవిడ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వమే రూ.15వేలు చెల్లించనుంది. కరోనా కష్టకాలంలో ప్లాస్మా దానం చేసిన దాతలకు ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదలయ్యాయి. కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు , ఫ్లాస్మా దాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: భయమెరుగక వైద్యం అందిస్తూ.. కరోనా బాధితులకు ప్రాణం పోస్తూ..!