కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అధికారుల బృందంతో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంపై... రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. కేబినెట్ సబ్ కమిటీకి సహాయకారిగా ఉండేందుకుగానూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో... వివిధ శాఖల కార్యదర్శుల బృందాన్ని వర్కింగ్ కమిటీగా నియమిస్తూ... సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 మార్చి 31లోగా మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అదేశించింది.
ఇదీ చదవండి : డిసెంబరు 1 నుంచి సీమ జిల్లాలో పవన్ పర్యటన