ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ బదిలీ ఉత్తర్వులను.. ప్రభుత్వం స్వల్పంగా సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఠాకూర్‌ను ఏపీఎస్ఆర్టీసీ వీసీ ఎండీగా కొనసాగించటంతో పాటు.. రాష్ట్ర ప్రజా రవాణా విభాగం కమిషనర్‌గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రజా రవాణా విభాగం కమిషనర్‌తో పాటు.. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ అఫీషియో వైస్ ఛైర్మన్ ఎండీగానూ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష