ETV Bharat / city

Sajjala On Employees Protest: ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు.. కూల్చగలరనే వ్యాఖ్యలకు అర్థంలేదు - సజ్జల - sajjala ramakrishna reddy

Sajjala On OTS issue: ఓటీఎస్​ ప్రక్రియలో తక్కువ రుసుంతోనే రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ప్రక్రియలో పేదలకు ఎలాంటి నష్టమూ లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం.. ఎవరినీ బలవంతం చేయడంలేదన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు సంయమనం పాటించాలని కోరారు. ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు, కూల్చగలరన్న ఉద్యోగ సంఘం నేత వ్యాఖ్యలకు అర్థంలేదన్నారు.

One Time Settlement issue
Sajjala On OTS issue
author img

By

Published : Dec 6, 2021, 5:32 PM IST

Updated : Dec 6, 2021, 6:45 PM IST

Sajjala On OTS issue: ఓటీఎస్‌తో పేదలకు నష్టం ఏమీ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఓటీఎస్ ప్రక్రియతో ఇళ్ల క్రయ విక్రయాలతో పాటు వారసులకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందన్నారు. తక్కువ రుసుంతో రిజిస్ట్రేషన్ చేసి హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చేది రూ. 4 వేల కోట్లేనని వెల్లడించారు. పంచాయతీలో రూ. 10వేలు, పురపాలికలో రూ. 15వేలు రుసుం విధిస్తున్నామన్నారు. నగర పాలకసంస్థ పరిధి ఇళ్లకు రూ. 20వేల రుసుం ఉందని వివరిచారు. ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందమని.. ఎవరినీ బలవంతం చేయడం లేదని వ్యాఖ్యానించారు.

కోపం ఉండదు..
Sajjala On Employees Protest: ఉద్యోగ సంఘాల నిరసనలపై సజ్జల స్పందించారు. ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుందని.. కోపం ఉండదన్నారు. ముఖ్యమంత్రి జగన్ హామీ మేకు నిర్ణీత గడువులోగా పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు కాస్త సంయమనం పాటించాలని కోరారు.

'ఓటీఎస్‌తో పేదలకు నష్టం ఏమీ లేదు. ఇళ్ల క్రయ విక్రయాలకు అవకాశం ఉంటుంది. వారసులకు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఓటీఎస్‌తో ప్రభుత్వానికి వచ్చేది రూ.4 వేల కోట్లే. తక్కువ రుసుముతో రిజిస్ట్రేషన్ చేసి హక్కులు కల్పిస్తున్నాం' - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు, కూల్చగలరనే వ్యాఖ్యలకు అర్థంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

chandra babu comments on OTS: మరోవైపు ఓటీఎస్ అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రశ్నల వర్షం కురిపించారు. ఇళ్లకు ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని చంద్రబాబు ఆరోపించారు. తప్పనిసరి కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బలవంతపు వసూళ్లను విమర్శిస్తే.. కేసులు పెడతారా? అని నిలదీశారు. ఛీటింగ్ కేసులు.. 420 కేసులు ఈ ప్రభుత్వంపై పెట్టాలని దుయ్యబట్టారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా అని నిలదీశారు. బలవంతంగా వసూలు చేస్తూ... స్వచ్ఛందమంటారా? అంటూ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

chandra babu comments on cm jagan: 'ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోంది'

Last Updated : Dec 6, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.