మాజీ ప్రధాని పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. నెక్లస్‌రోడ్డులో పీవీ మార్గ్‌ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై(Governor Tamilisai)... అనంతరం సీఎం కేసీఆర్‌తో కలిసి నెక్లెస్‌రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీవీ విగ్రహానికి నివాళులు అర్పించారు. పీవీ శతజయంతి అందరికీ గొప్ప పండుగ అని గవర్నర్ పేర్కొన్నారు.
'' పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రచనలను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయం. భవిష్యత్ తరాల కోసం పీవీ రచనలు, వ్యాసాలను ఒకచోటకు చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం పీవీకి అర్పించిన ఘన నివాళి తరతరాలకు గుర్తుండిపోతుంది.''
-గవర్నర్ తమిళిసై
పీవీ రాజకీయాలతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని కలాం చెప్పేవారని గుర్తు చేశారు. పీవీ జయంత్యుత్సవాలతో తెలంగాణ తల్లి సంతోషిస్తోందని గవర్నర్ అన్నారు.
ఇదీ చూడండి: పెళ్లి అనగానే పరారైన యువకుడు..