ETV Bharat / city

కానిస్టేబుళ్ల మృతి పట్ల గవర్నర్, సీఎం విచారం.. - srikakulam accident news

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఈ ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కానిస్టేబుళ్ల మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన గవర్నర్, సీఎం

author img

By

Published : Aug 23, 2021, 8:36 PM IST

Updated : Aug 23, 2021, 10:10 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందటం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. పోలీసు వాహనాన్ని లారీ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందగా పలువురు గాయపడినట్లు అధికారులు గవర్నర్‌కు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, చికిత్స అందించాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

  • Chief Minister Sri YS Jagan Mohan Reddy has expressed grief over the spot death of four Armed Reserve (AR) personnel in a road accident at Summadevi national highway in Srikakulam district. The Chief Minister conveyed his heartfelt condolences to the bereaved family members.

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్...

శ్రీకాకుళం జిల్లా రోడ్డు ప్రమాదంలో నలుగురు సాయుధ రిజర్వ్...ఏఆర్ సిబ్బంది మరణించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • శ్రీకాకుళం జిల్లా, పలాస మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందారన్న వార్త మనసును కలచివేసింది. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

    — N Chandrababu Naidu (@ncbn) August 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి...

ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందారన్న వార్త మనసును కలచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆవేదన వ్యక్తం చేసిన నారా లోకేశ్...

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందడం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. నలుగురి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని లోకేశ్ కోరారు.

కానిస్టేబుళ్ల మృతి బాధాకారం: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లాలో విధినిర్వహణలో ఉన్న నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందడం అత్యంత బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

పోలీసుల దుర్మరణం బాధాకరం: పవన్ కల్యాణ్

శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

Road accident: శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం, నలుగురు పోలీసుల దుర్మరణం

Last Updated : Aug 23, 2021, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.