రాజ్యాంగం ప్రకారం ఓటు అన్ని హక్కులకు తల్లి లాంటిదని.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రజల చేతుల్లో ఓటు శక్తిమంతమైన ఆయుధమని పేర్కొన్నారు. రాజ్భవన్లో జరిగిన 11వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో గొప్ప సంప్రదాయం ఎన్నికల సమయంలో ఓటును సద్వినియోగం చేసుకోవడమేనని అన్నారు.
ఓటర్లను శక్తివంతం చేయడం, అప్రమత్తంగా ఉంచడం, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం అనే సందేశంతో దేశవ్యాప్తంగా 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదులో మెరుగైన పనితీరు ప్రదర్శించిన పలు జిల్లాల కలెక్టర్లను ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు.
ఇదీ చదవండి: 'ఓటు హక్కును ప్రతి ఒక్కరు గౌరవించాలి'