శ్రీ హరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్-01) సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి.
శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సి-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించడం పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీఎస్ఎల్వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టటంపై ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. మన దేశానికి చెందిన ఉపగ్రహం ఈవోఎస్-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుందని... ప్రయోగం సఫలీకృతం చేసిన ప్రతి ఒక్క ఇస్రో శాస్త్రవేత్త అభినందనీయులని అన్నారు.
ఇదీ చదవండి