ETV Bharat / city

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలంటూ సీఎస్​కు గవర్నర్ ఆదేశం - ap high court on SEC

Nimmagadda Ramesh Kumar
Nimmagadda Ramesh Kumar
author img

By

Published : Jul 22, 2020, 10:54 AM IST

Updated : Jul 22, 2020, 11:56 AM IST

10:53 July 22

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నియమించాలంటూ గవర్నర్ ఆదేశం

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8122955_asldkkf.JPG
గవర్నర్ ఆదేశాలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన గవర్నర్‌...హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్​ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు, ఆదేశాలను వెంటనే అమలు చేయాలని లేఖలో గవర్నర్‌ కోరారు.

వివాదం మొదలైంది ఇక్కడే..!

కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్​ఈసీ రమేశ్ కుమార్ మార్చి 15న ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రభుత్వంలోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర పదజాలంతో విమర్శల వర్షం గుప్పించారు. ప్రభుత్వాన్ని, వైద్యఆరోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఎస్​ఈసీగా ఉన్న రమేశ్​కుమార్​ను ఆ పదవి నుంచి ఎలా తొలగించాలో తమకు తెలుసంటూ...ప్రభుత్వ సలహాదారు సజ్జల, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా చేశారు.

పదవీకాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్​..!

నిమ్మగడ్డ రమేశ్​ను ఎస్​ఈసీ పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్​ ప్రయోగించింది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్-200లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అందులోని వివరాలను పొందుపరుస్తూ జీవో-617 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే ఎస్​ఈసీ పదవికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల పదవీకాలం మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం... మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా పని చేసినవారు మరో మూడేళ్లు కొనసాగే వెసులుబాటు కల్పించింది. ఆరేళ్లకు మించి పదవిలో కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

పదవీ కాలం ముగిసింది...

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డినెన్స్‌, నోటిఫికేషన్‌ ప్రకారం ఆయన పదవీకాలం ముగిసిందంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.

వెంటనే గవర్నర్ ఆమోదం...

ఎస్​ఈసీ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గవర్నర్‌ను కలిసి ఈ అంశాలను వివరించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, ఉత్తర్వుల జారీ చకచకా జరిగిపోయాయి. ఇక కొత్త ఎస్​ఈసీగా పొరుగు రాష్ట్రానికి చెందిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ పేరును సూచిస్తూ... గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. వెంటనే ఆయన ఆమోదముద్ర వేశారు.

కోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ...

ఎస్​ఈసీ పదవి నుంచి తనని తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్​ హైకోర్టును ఆశ్రయించారు. తనను దురుద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించారని పిటిషన్​లో పేర్కొన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఆర్డినెన్స్ తెచ్చామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని వివరించారు. ఎస్​ఈసీ పదవీ కాలంపై ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌కు హైకోర్టులో భాజపా నేత కామినేని శ్రీనివాస్​ రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని అఫిడవిట్​లో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్, పదవీకాలానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని ప్రస్తావించారు.

ఎస్​ఈసీ విషయంలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టులో వాదించింది. కొత్త ఎస్‌ఈసీ జస్టిస్‌ వి.కనగరాజ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ చట్ట నిబంధనలకు లోబడి ఉందన్నారు. ఇంప్లీడ్‌ పిటిషనర్ల తరఫున న్యాయవాదులు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించారు.

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, ఇతర పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఎ.సత్యప్రసాద్‌, పి.వీరారెడ్డి ప్రతి సమాధానంగా(రిప్లై) వాదనలు వినిపించారు. ''ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అత్యవసర పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం తన చర్యను ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించడం కోసమే ఆర్డినెన్స్‌ తెచ్చారన్నారు. ఆర్డినెన్స్‌, తదనంతర జీవోలను రద్దు చేయాలని'' కోరారు.

హై కోర్టు తీర్పు..

ఇరువైపు వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు..తీర్పును వెలువరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆర్డినెన్స్​ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఎస్​ఈసీ నియామకం చెల్లదంటూ చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధుల్లో చేరిన రమేశ్ కుమార్...కోర్టు ఆదేశాలకనుగుణంగా ఎస్​ఈసీగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. గతంలోనే మాదిరిగానే తన విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తానని ఓ ప్రకటనలో తెలిపారు.

సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

ఎస్​ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంలో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్-200ను సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై.. విచారణ జరిపే అంశం న్యాయస్థానాల పరిధిలోకి రాదని.. పిటిషన్ లో పేర్కొంది. ప్రభుత్వానిది విధానపర నిర్ణయమని.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. మరోవైపు ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తమ వాదన వినకుండా ఎలాంటి తీర్పూ వెలువరించొద్దంటూ 5 కేవియట్ పిటిషన్లూ దాఖలయ్యాయి.

రాజ్యాంగబద్ధ పదవులతో ఆటలా..?

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. ఆర్డినెన్స్‌ వెనక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి ఆర్డినెన్స్ ఎలా ఆమోదిస్తారని.. రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నవారితో ఆటలు ఆడుకోవద్దని పేర్కొంది.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీ వ్యవహారం: మెుదటి నుంచి.. అసలేం జరిగింది..?

Last Updated : Jul 22, 2020, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.