గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. ఇండియన్ రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు హోదాలో జిల్లా కలెక్టర్లు, జిల్లా యూనిట్ అధికారులతో రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెడ్ క్రాస్ చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా రెడ్ క్రాస్ చేపట్టిన కార్యక్రమాలను గవర్నర్ ప్రశంసించారు. కరోనా వైరస్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్లు, రెడ్ క్రాస్ జిల్లా అధికారులను గవర్నర్ కోరారు.
వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఛైర్మన్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.కె. పరీడా, వివిధ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి : విశాఖ వైద్యుడు సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు