ETV Bharat / city

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వంలో కదలిక.. రాజధాని రైతుల ప్లాట్ల అభివృద్ధికి చర్యలు - అమరావతి తాజా వార్తలు

రాజధాని రైతుల ప్లాట్ల అభివృద్ధికి చర్యలు

author img

By

Published : Mar 10, 2022, 10:07 PM IST

Updated : Mar 10, 2022, 10:58 PM IST

22:05 March 10

రాజధాని రైతుల ప్లాట్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

రాజధాని అమరావతి రైతుల ప్లాట్ల అభివృద్ధి విషయంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుల ప్లాట్లకి వెళ్లే మార్గాల్లో పిచ్చిమొక్కలు, కంప చెట్లు తొలగింపు పనులు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరిస్తున్నారు.

హైకోర్టు తీర్పులో ఏముందంటే..

అమరావతిపై హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని.. అలాంటప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం కుదరదన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచించిందని న్యాయవాదులు తెలిపారు. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. పూలింగ్‌ భూములను ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

రిట్‌ ఆఫ్‌ మాండమస్‌ నిరంతరం కొనసాగుతుందని.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిట్‌ ఆఫ్‌ మాండమస్‌ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపైనా మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి

హైకోర్టు తీర్పు ఉహించిందే.. త్వరలో మూడు రాజధానుల బిల్లులు: మంత్రి బొత్స

Last Updated : Mar 10, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.