రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఇకపై మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897 ప్రకారం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో ఫేస్ మాస్క్ లేదా ముఖాన్ని కప్పి ఉంచే వస్త్రం ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు అయ్యేలా ప్రచారం నిర్వహించటంతో పాటు కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఇతర క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు మాస్కు ధరించేలా విస్తృత ప్రచారం కల్పించటంతో పాటు... మాస్కు ధరించటాన్ని అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. లాక్ డౌన్ సమయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ఫేస్ మాస్కు, ముఖం కప్పుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: