దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) నుంచి మూడు జిల్లాలను వేరు చేస్తూ ప్రభుత్వం... ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. 15 లక్షల షేర్ క్యాపిటల్, పది లక్షల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో సీపీడీసీఎల్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన సీపీడీసీఎల్ కు ఎం.హరనాథ్ రావును తొలి వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లాలు సీపీడీసీఎల్ పరిధిలోకి రానున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉండనున్నాయి.
ఇదీ చదవండి : 'ప్రజల సౌకర్యాలను గాలికొదిలి... ఛార్జీల పెంపు ఏంటి?'