ETV Bharat / city

కొవిడ్ హెల్ప్ లైన్ సేవలు: జిల్లాలవారీగా ఫోన్​ నెంబర్లు - కొవిడ్ కాల్​ సెంటర్

రాష్ట్రంలో కొవిడ్ కేసుల విస్తృతి నేపథ్యంలో ఫిర్యాదులు, సమాచారం కోసం గతంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కార్యకలాపాలను వైద్యారోగ్యశాఖ మరింత విస్తృతం చేసింది. ఇప్పటికే ఉన్న 104 కాల్ సెంటర్​లో అదనంగా కన్సల్టేషన్ కోసం వైద్యులను నియమించారు. కొవిడ్ బాధితులు రోగ లక్షణాలు, పరీక్షలు, వైద్యం, హోమ్ ఐసోలేషన్, మందులు, చికిత్స ఇలా ఏ అంశంపై సమాచారం కోరినా కాల్ సెంటర్ ద్వారా పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు. ఐవీఆర్ఎస్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్​ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారానూ వైద్య సలహాలు కోరే అవకాశముంది.

కొవిడ్ కాల్​సెంటర్ సేవల్ని మరింత విస్తృతం చేసిన ప్రభుత్వం

author img

By

Published : Apr 21, 2021, 8:08 PM IST

Updated : Apr 23, 2021, 3:02 PM IST

రాష్ట్రంలో కొవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కాల్ సెంటర్ సేవల్ని మరింత విస్తృతం చేసింది. గతంలో ఏర్పాటు చేసిన కొవిడ్ టోల్ ఫ్రీ సెంటర్ 104 తో పాటు ఇతర కంట్రోల్ రూమ్ నెంబర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించాల్సిన వేదికలనూ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కొవిడ్ టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబరు-104 (ఆరోగ్యసలహాలు, ఫిర్యాదులు చేసే అవకాశముంది. ఇక రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబరు 0866-241098 ద్వారానూ అత్యవసర సమయాల్లో సంప్రదించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐవీఆర్ఎస్ ద్వారానూ 8297104104 నెంబరు ద్వారానూ కొవిడ్ సమాచారం అందుతుందని ప్రకటించింది. 8297104104 వాట్సప్ చాట్ బోట్ ద్వారానూ కోవిడ్19కి సంబంధించిన ఫిర్యాదులు, సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వారానూ వీడియోకాల్ చేసి డాక్టర్​ను సంప్రదించే అవకాశం కల్పించారు.

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కోవిడ్ 19 ఏపీ యాప్​ను కూడా డౌన్​లోడ్ చేసుకుని సమాచారం తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆరోగ్యాంధ్ర ట్విటర్, ఫేస్ బుక్ , ఇన్​స్టాగ్రామ్ ఖాతాల ద్వారానూ వైద్యారోగ్యశాఖను సంప్రదించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 104 టోల్ ఫ్రీనెంబరు ద్వారానే టెలిమెడిసిన్​కు కూడా అవకాశం కల్పించినట్టు వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. యధావిధిగా అంబులెన్స్ సేవల నెంబర్ 108 పని చేస్తుందని స్పష్టం చేసింది. 104 కాల్ సెంటర్​కు ఫోన్ చేసినా ఈ సేవల్ని పొందే అవకాశముందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 185 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. 2,734 ఐసీయూ పడకలు, 11,753 ఆక్సిజన్ సరఫరాతో కూడిన పడకలు, 5,987 సాధారణ పడకల్ని ఆస్పత్రుల్లో సిద్ధం చేశారు. అత్యవసర చికిత్సల కోసం 2,521 వెంటిలేటర్ కలిగిన పడకలు కూడా సిద్ధంగా ఉంచారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా అస్పత్రులు, గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రెండో విడత వ్యాక్సిన్ డోస్ కోసం కూడా జిల్లాల వారీగా కలెక్టర్లు సర్కులర్​లు జారీ చేశారు.

జిల్లాల వారిగా కాల్ సెంటర్ల ఫోన్ నంబర్లు

1. శ్రీకాకుళం - 6300073203
2. విజయనగరం - 08922-227950, 9494914971
3. విశాఖపట్నం - 0891-2501255, 0891-2501256, 0891-2501257
4. తూర్పుగోదావరి - 8842356196
5. పశ్చిమగోదావరి - 18002331077
6. కృష్ణా - 9491058200
7. గుంటూరు - 0863-2271492
8. ప్రకాశం - 7729803162
9. నెల్లూరు - 9618232115
10. చిత్తూరు - 9849902379
11. వైయస్​ఆర్ కడప - 08562-245259
12. అనంతపురం - 08554-277434
13. కర్నూలు - 9441300005

ఇదీ చదవండి:

రామతీర్థంలో కన్నుల పండువగా రాములోరి కల్యాణం

ఆ నాలుగు రాష్ట్రాల్లో.. అందరికీ టీకా ఉచితంగానే

Last Updated : Apr 23, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.