ETV Bharat / city

కొత్త జిల్లాలకు మార్చి 11కల్లా సిబ్బంది ఖరారు.. ఏప్రిల్‌ 2 నుంచి ...

కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు మార్గదర్శకాలు

author img

By

Published : Feb 26, 2022, 8:58 PM IST

Updated : Feb 27, 2022, 6:01 AM IST

20:54 February 26

ఏప్రిల్ 2ను జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అపాయింటెడ్ డేగా వెల్లడి

New Districts : జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్ ఫార్మ్ లను జారీ చేసింది. సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ వీటిని పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 2 ఉగాది నాటినుంచి కొత్త జిల్లాల్లోని పునర్ వ్యవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పనిచేయడం ప్రారంభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ఏప్రిల్ 2వ తేదీని జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధించి అపాయింటెడ్ డే గా పేర్కొంటూ ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వనరులు, ఉద్యోగుల శాశ్వత విభజనకు కొంత సమయం పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ప్రభుత్వ విధులు సాఫీగా జరిగేందుకు తాత్కాలికంగా ఉద్యోగులు, పోస్టులు, వనరుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది.

ఉద్యోగులు, అధికారులను ఆయా కొత్త జిల్లాలకు ఎలా తాత్కాలిక కేటాయించాలనే అంశంపై ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...

  • కొత్త జిల్లాలకు సిబ్బందిని, అధికారులను తాత్కాలికంగా కేటాయించే క్రమంలో తక్కువ కేడర్‌ బలం ఉన్న జిల్లా, డివిజన్‌ స్థాయిలోని కార్యాలయాలను పరిగణనలోకి తీసుకోరు.
  • రాష్ట్ర, ప్రాంతీయ, మండల, గ్రామస్థాయి కార్యాలయాల్లోని సిబ్బందిని తాత్కాలిక కేటాయింపులకు పరిగణనలోకి తీసుకోరు. జిల్లా, డివిజన్‌ స్థాయిలోని కార్యాలయాలనే తీసుకుంటారు.
  • జిల్లా, డివిజన్‌ హెడ్‌ మినహా ఏ కొత్త పోస్టునూ కొత్తగా సృష్టించడం లేదు.
  • ఆర్డర్‌ టు సర్వ్‌ ద్వారా ఈ తాత్కాలిక కేటాయింపులన్నీ పూర్తిచేస్తారు. ఈ ప్రక్రియ చేపట్టేందుకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు.
  • ఉద్యోగులకు అర్హత ప్రకారం బదిలీ రవాణా భత్యం మంజూరు చేస్తారు.
  • కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగు ఉద్యోగులనూ అవసరాన్ని బట్టి పునర్‌ వ్యవస్థీకరించిన జిల్లా, డివిజన్‌ కార్యాలయాలకు కేటాయిస్తారు.
  • కాంట్రాక్టు నియామకం చేసినట్లు విభాగాధిపతి నిర్ధారించాలి. ఇందుకు ఇప్పటికే ఆర్థికశాఖ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలి.
  • అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలకు సంబంధిత రెవెన్యూ జిల్లాకు సంబంధించిన అధికార పరిధి ఉంటుంది.
  • ఈ జిల్లా కార్యాలయాల్లో జిల్లాస్థాయి పాలనాధికారి ఉండేలా అవసరమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
    ఉదాహరణకు వ్యవసాయశాఖలో జిల్లా అధిపతికి ప్రస్తుతం ఉన్న జాయింట్‌ డైరక్టర్‌ హోదా బదులు జిల్లా వ్యవసాయాధికారి అన్న హోదాను ఏర్పాటుచేస్తారు. దీనివల్ల ఒక జేడీ లేదా డీడీ క్యాడర్‌ అధికారిని జిల్లా పోస్టుల్లో నియమించుకోవచ్చు. స్త్రీ శిశు సంక్షేమశాఖలో ప్రాజెక్టు డైరెక్టర్‌ లేదా అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ హోదా ఉన్న అధికారిని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిగా నియమించవచ్చు.
  • జిల్లా అధిపతుల కొరత తీర్చేందుకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నవారితో సహా ఒకే ర్యాంకుతో సమానమైన, లేదా అంతకన్నా ఒక ర్యాంకు తక్కువ ఉన్న క్యాడర్‌ అధికారుల సమూహం నుంచి తాత్కాలికంగా జిల్లా కార్యాలయ అధిపతులుగా నియమించవచ్చు. తాత్కాలిక కేటాయింపు నిష్పత్తినీ ఖరారుచేస్తారు. పునర్‌ వ్యవస్థీకరించిన రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లోనూ తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ చేపడతారు.

ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాలు

ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. శనివారం అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రాయలసీమ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో కొత్తగా ప్రకటించిన నాలుగు జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు 1600 అభ్యంతరాలు వచ్చాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాయలసీమ ప్రజల నుంచి మార్చి 3 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను పరిశీలించి వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో హిందూపురం, రాజంపేట పట్టణాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలనే వినతులు ఎక్కువగా అందాయని తెలిపారు. పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనీ వినతులు వచ్చాయన్నారు. సమావేశంలో రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్దార్థ్‌ జైన్‌, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు నాగలక్ష్మి, పి.కోటేశ్వరరావు, ఎం.హరినారాయణన్‌, కడప జేసీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ప్రధాని మోదీతో మాట్లాడిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు.. ఏమన్నారంటే?

Last Updated : Feb 27, 2022, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.