ETV Bharat / city

తెలంగాణ: ఆ తొమ్మిది మంది హత్యకు కారణం ప్రేమ! - గొర్రెకుంట బావి ఘటన

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించిన గొర్రెకుంట బావి మృతదేహాల మిస్టరీ వీడింది. ప్రేమ వ్యవహారమే ఈ తొమ్మిది మంది హత్యలకు కారణమని నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ పోలీస్ విచారణలో వెల్లడించాడు.

gorrekunta well mystery reveled
వీడిన మిస్టరీ
author img

By

Published : May 25, 2020, 9:52 AM IST

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా గొర్రెకుంట బావి మృతదేహాల మిస్టరీ వీడింది. 9 మంది మరణానికి బిహార్​కు చెందిన సంజయ్ కుమార్ యాదవే కారణమని... పోలీసుల విచారణలో వెల్లడైంది. కూల్ డ్రింకులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి.. మక్​సూద్ కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లాక... బావిలోకి తోసేసి హత్యచేసినట్లు సంజయ్ పోలీసుల వద్ద నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

సంబంధిత కథనాలు: బావిలో పడి నలుగురు అనుమానాస్పద మృతి

ప్రేమ వ్యవహారమే కారణమా?

మక్ సూద్ కుమార్తెతో ఉన్న ప్రేమ వ్యవహారం... ఇతరులతో ఆమె సన్నిహితంగా ఉంటోందన్న కసితో సంజయ్ ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మక్ సూద్ కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు వచ్చి... శీతలపానీయాల్లో నిద్రమాత్రలిచ్చి స్పృహ కోల్పోయిన తరువాత ఒక్కొక్కరిగా బావిలో పడేసి హత్యచేసినట్లు విచారణలో తేలింది.

సంబంధిత కథనాలు: తెలంగాణ... బావిలో ఐదు మృతదేహాలు లభ్యం

20 ఏళ్ల క్రితం వరంగల్​కు

పశ్చిమ్ బంగాకు చెందిన మక్ సూద్ 20 ఏళ్ల క్రితమే వరంగల్​కు వచ్చి స్థిరపడ్డాడు. గత ఏడాది డిసెంబర్​లో గొర్రకుంటలోని ఓ గోదాంలో... గన్నీ సంచులు కుట్టే పనిలో చేరాడు. నగరంలోని కరీమాబాద్​లో నివాసముంటున్న మక్ సూద్... లాక్ డౌన్ కారణంగా తాను పనిచేసే గోదాం వద్దకే మకాం మార్చాడు. వీరుండే పక్క గదిలోనే ఇద్దరు బిహార్​ యువకులు కూడా ఉంటున్నారు.

సంబంధిత కథనాలు: తెలంగాణ: మత్యుబావిలో 9 మృతదేహాలు... హత్యా... ఆత్మహత్యలా?

మొదట నాలుగు... తర్వాత ఐదు

గురువారం సాయంత్రం... గోదాం సమీపంలోని పాడుబడిన బావిలో మక్ సూద్ అతని కుటుంబసభ్యుల నాలుగు మృతదేహాలు వెలుగుచూశాయి. మరునాడు ఇదే బావిలో 5 మృతదేహాలు కనిపించాయి. మక్ సూద్... అతని భార్య నిషా, కొడుకు సొహెల్, షాబాజ్, కుమార్త బుస్రా... మనమడితో పాటు ఇద్దరు బిహార్ యువకులు, మక్ సూద్​కు బాగా పరిచయం ఉన్న షకీల్ మృతదేహాలు కనిపించాయి. ఒక్కసారిగా 9 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత కథనాలు: తెలంగాణ: ఇంకా తేలని మృతుల మిస్టరీ

ఓ ఆటో వాలా కూడా

పోలీసులు గత మూడు రోజలుగా ముమ్మర దర్యాప్తు చేశారు. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో కూడా.. నీళ్లలో పడి చనిపోయారని స్పష్టంగా ఉంది. చివరకు ఫోన్ కాల్ డేటా ఆధారంగా... సంజయ్ యాదవ్, మోహన్​తోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు. ఓ ఆటో వాలా కూడా సంజయ్​కు సహకరించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: నెల్లూరులో సామాజిక మాధ్యమ కార్యకర్తపై దుండగుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.