gold seized from woman at Shamshabad airport: అధికారులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం రవాణా ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి అధికంగా బంగారాన్ని తీసుకొస్తున్న ఓ మహిళ నుంచి కస్టమ్స్ అధికారులు 268.4 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.13.73 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
మహిళ బంగారాన్ని పేస్టు రూపంలో టేపులో ఉంచి.. వీపునకు అతికించుకుందని అధికారులు పేర్కొన్నారు. మహిళపై అనుమానంతో తనిఖీలు చేయగా.. బంగారం బయటపడిందన్నారు.
ఇవీ చదవండి: