ETV Bharat / city

దక్షిణ భారత కుంభమేళాలో ఆ 'మ్యూజియం' ఎంతో ప్రత్యేకం - మేడారం జాతరలో గిరిజన మ్యూజియం

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం ప్రసిద్ధి గాంచింది. దక్షిణ భారత కుంభమేళాగా పేరు పొందింది. అంతటి ప్రాచుర్యం కలిగిన సమ్మక్క, సారలమ్మ మహా సంబురానికి కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు, కళలను అందరికీ పరిచయం చేసేందుకు అక్కడ గిరిజన మ్యూజియం సిద్ధమైంది.

girijana-museam
girijana-museam
author img

By

Published : Feb 4, 2020, 11:47 AM IST

దక్షిణ భారత కుంభమేళాలో ఆ 'మ్యూజియం' ఎంతో ప్రత్యేకం

తెలంగాణ... మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టేవిధంగా రూపుదిద్దుకున్న గిరిజన మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గిరిజనుల జీవన విధానాన్ని గిరిజనేతరులకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఈ మ్యూజియాన్ని నిర్మించారు.

నాటి నుంచి నేటి వరకు

పూర్వకాలం నుంచి నేటి వరకు ఆదివాసీల గురించి తెలియచేసే చిత్రాలు, వస్తువులు, పనిముట్లను ప్రజలకు పరిచయం చేసేవిధంగా ఇందులో పొందుపరిచారు. ఆదివాసీలు వాడిన ఆయుధాలు, ఖడ్గం, విల్లంభులు మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దశాబ్దాలుగా వినియోగిస్తూ వచ్చిన వస్తువులతోపాటు, నేటితరం పెయింటింగ్స్ కూడా అందుబాటులో ఉంచారు. వీటితోపాటు పూర్వం వినియోగించిన గొడ్డళ్లు, నాగళ్లు, దేవతల శిల్పాలు, మహిళల నృత్యాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

పవిత్రమైన వస్తువులు కూడా

ఒక్కసారి మ్యూజియంలో అడుగుపెట్టగానే పాతకాలంలోకి వెళ్లిన భావన ప్రతి ఒక్క సందర్శకునికి కలుగుతుంది. ఆరు బయట వ్యవసాయ క్షేత్రాల్లో ఉపయోగించే మంచెలు, మేకల మంచెలతోపాటు సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను ప్రతిబింబించే విధంగా శిల్పాలు చెక్కారు. వనదేవతల పుట్టుక, వివాహం, వన ప్రవేశం ఇలా అనేక అంశాలు వాటిలో ప్రస్ఫుటిస్తున్నాయి. ఆదివాసీలకు సంబంధించిన వివిధ వస్తువులను ఎప్పటికప్పుడు సేకరించి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతున్నారు. సమ్మక్క, సారలమ్మలకు సంబంధించి పవిత్రమైన వస్తువులను కూడా ప్రదర్శనకు అందుబాటులో ఉంచారు.

ఇవీ చూడండి: సామ్​ చిత్రమా.. రవివర్మకే అందని అందమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.