గ్రామీణ, పట్టణస్థాయి వలంటీర్లకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ వర్తింప చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణలో భాగస్వాములైన గ్రామ, వార్డు వలంటీర్లకు ఈ ప్యాకేజీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 2లక్షల 60వేల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఉన్నారు. వీరంతా మూడు విడతలుగా కొవిడ్ -19 ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ పేషెంట్లతో కలిసే అవకాశం ఉంది. వీరికి అండగా ఉండేందుకు ఈ ప్యాకేజీ కింద బీమా కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఇవీ చదవండి: 'ముస్లింలకు భారత్ స్వర్గధామం- వారి హక్కులకు పూర్తి రక్షణ'