విజయవాడ కరకట్ట రక్షణగోడ నిర్మాణం తెదేపా ప్రభుత్వ కృషిలో భాగమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 2014కి ముందే ప్రతిపక్షంలో ఉండగా దీనిపై పోరాటం చేసి అధికారంలోకి రాగానే తొలిదశ నిర్మాణం పూర్తిచేయటంతో పాటు రెండోదశకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. తెదేపా చేపట్టిన కార్యక్రమాలకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని గద్దె రామ్మోహన్ దుయ్యబట్టారు.
ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా రక్షణగోడ, రహదారి నిర్మించి అక్కడి పేదలకు పట్టాలివ్వాలని తెదేపా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని గద్దె రామ్మోహన్ గుర్తుచేశారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం మూడొంతుల ఇళ్లు తొలగించేలా మార్కింగ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఉపయోగపడే రీతిలోనే రెండో దశ రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన