ETV Bharat / city

సైకిల్‌ సవారీకి చలో చలో!

కరోనా మహమ్మారి ప్రజల రోజువారీ జీవితాలను దిగ్బంధించింది. వ్యాయామశాలలకు తాళాలు పడ్డాయి. ప్రజా రవాణా అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. పిల్లలు ఇళ్లలో ఉండలేక విసుగెత్తిపోతున్నారు. ఈ సంక్షోభం సైకిళ్లకు తీపి కబురు మోసుకొచ్చింది. వాటికి అనూహ్య రీతిలో గిరాకీ పెరిగింది.

cycle
cycle
author img

By

Published : Jun 29, 2020, 6:38 AM IST

గ్రామీణులు, పట్టణవాసుల జీవితాలతో సైకిల్‌ పెనవేసుకుంది. రైతులు, జాలర్లు, చిరు వ్యాపారులు, పాలవిక్రేతలు, ఇంటి సమీపంలోనే పాఠశాలలున్న విద్యార్థులు తదితరులకు ఇప్పటికీ ఇది నమ్మకమైన నేస్తమే. వివిధ కారణాలతో కొంతకాలంగా మోటార్‌బైక్‌ల వాడకం పెరిగింది. అయితే కరోనాతో ప్రజల్లో ఆరోగ్యంపై స్పృహ పెరగడంతో తాజాగా సైకిళ్లపైకి దృష్టి మరల్చారు. ప్రజాహితం కోసం మోటారు రహిత రవాణా వ్యవస్థ స్థానంలో సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని కేంద్రం సైతం రాష్ట్రాలను సూచించడమూ కలిసొచ్చింది.

  • రాష్ట్ర వ్యాప్తంగా 1500 వరకు సైకిళ్లను విక్రయించే పెద్ద దుకాణాలు ఉంటాయి.
    లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సైకిళ్ల అమ్మకాలు 2019తో పోలిస్తే రెట్టింపైనట్లు విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర నగరాల్లోని పలువురు డీలర్లు తెలిపారు.
  • అమ్మఒడి డబ్బులు ఖాతాల్లో పడటంతోనూ 6-13 ఏళ్ల వయసు పిల్లల కోసమూ కొందరు తల్లిదండ్రులు ఎక్కువగానే తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
  • కార్యాలయాలకు, మార్కెట్లకు సమీపంలో ఉన్న వారు ప్రజారవాణాకు బదులు సొంతంగా వెళ్లడానికి వీటిని కొంటున్నారు.
  • ఆన్‌లైన్‌లోనూ వీటి కొనుగోళ్లు ఇటీవల పెరిగాయి.

డిమాండు భారీగానే పెరిగింది

మే మొదటి వారంలో వలస కూలీలు విపరీతంగా సైకిళ్లు కొన్నారు. ఆ తర్వాతా అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. గతంలో పాఠశాలలు, కళాశాలల పిల్లలకే ఎక్కువగా కొనేవారు. లాక్‌డౌన్‌ తర్వాత వ్యాయామ కోణంలో వీటిపై చాలామంది దృష్టి నిలిపారు. - గౌరీశంకర్‌, విశాఖ సైకిల్‌ స్టోర్స్‌, విశాఖపట్నం

రిటైల్‌ దుకాణాల్లో కళకళ

వైద్యుల సలహాల మేరకు సైక్లింగ్‌ చేస్తున్న వారు పెరుగుతున్నారు. మాది హోల్‌సేల్‌ వ్యాపారం. సాధారణంగా జూన్‌లో 900 సైకిళ్లు విక్రయించేవాళ్లం. ప్రస్తుతం ఇప్పటికే ఆ సంఖ్య 1500 దాటింది. రిటైల్‌ షాపుల్లోనూ అమ్మకాలు రెట్టింపు కావడంతో అవి కళకళలాడుతున్నాయి. - రాజేశ్‌, జ్యోతి సైకిల్స్‌, కాకినాడ

వేచి చూస్తే తెలుస్తుంది

గతేడాది ఇదే సమయంలో పోలిస్తే దాదాపు 200% పైగానే సైకిళ్లమ్ముతున్నాం. లాక్‌డౌన్‌తో 2నెలలుగా షాపులు తెరవనే లేదు. ఆ కారణంగా అమ్మకాలు పెరిగాయా..? లేక జనానికి సైకిళ్లపై నిజంగా మక్కువ పెరిగిందా..? అనే విషయం తెలియాలంటే మరో 2నెలలు వేచి చూడాలి. - కిరణ్‌, పెడల్‌ జోన్‌, విజయవాడ

ప్రపంచవ్యాప్తంగానూ పెరిగిన కొనుగోళ్లు

అమెరికాలో లాక్‌డౌన్‌ అమలు తర్వాత పెద్దలు ఉపయోగించే సైకిళ్లకు ఏప్రిల్‌లో మూడురెట్లు, పిల్లల, ఎలక్ట్రిక్‌ సైకిళ్లకు రెండురెట్ల డిమాండ్‌ పెరిగింది. ఈ అనూహ్య పరిణామంతో అమెరికాలో బుక్‌ చేసుకున్న వారు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. యూఎస్‌ఏలో విక్రయించే 90% సైకిళ్లను చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. వివిధ దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ‘‘లాక్‌డౌన్‌ మొదలయ్యాక విద్యుత్తు సైకిళ్లకు అమెరికాలో 138%, బ్రిటన్‌లో 184% వరకు డిమాండ్‌ పెరిగింది.’’ అని నెదర్లాండ్‌కు చెందిన ఈ-సైకిళ్ల తయారీ సంస్థ వెల్లడించింది.

మనదేశంలో సైకిల్‌ సిటీగా పేరొందిన కోల్‌కతా, స్మార్ట్‌సిటీలుగా మారుతున్న భోపాల్‌, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లోనూ అమ్మకాలు భారీగా పెరిగాయి.కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఉన్న విశాఖ, విజయవాడల్లోనూ వీటి అమ్మకాల జోరు పెరిగింది.

ఇదీ చదవండి: చైనా విద్యుత్ పరికరాలతో సైబర్ దాడులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.