అక్టోబరు 10న వైఎస్‌ఆర్ కంటివెలుగు పథకం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని ఐదు దశల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఒకటి , రెండు దశల్లో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు చేయాలని... మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటీ బేస్ పద్ధతిలో పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పథకం పర్యవేక్షణకు కలెక్టర్ ఛైర్మన్గా జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి :మెడలోతు నది దాటి ఆసుపత్రికి చేరిన గర్భిణి