చివరి దశ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండగా... గ్రామాల్లో ప్రచారాల సందడి కొనసాగుతోంది. అభ్యర్థులు తమకు దక్కిన గుర్తులతో వినూత్న ప్రదర్శన నిర్వహిస్తూ.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని 66 పంచాయతీల్లో నాలుగో దశ ఎన్నికలు.. 21న జరగనున్నాయి. అభ్యర్థులతో స్థానిక తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న ప్రచారాల్లో పాల్గొన్నారు. కల్లుమరి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అయిన గంగమ్మకు మంచం గుర్తు కేటాయించారు. ప్రచారానికి మంచం తీసుకెళ్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
నెల్లూరు డివిజన్లో నాలుగో విడత ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా సాగుతున్నాయి. బ్యాండ్ మేళాలు, ప్రచార వాహనాలతో గ్రామీణ ప్రాంతాలు హోరెత్తుతున్నాయి. పలువురు అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను ప్రదర్శిస్తూ వినూత్నంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమను గెలిపిస్తే పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఇదీ చదవండి: