తెలంగాణలోని.. సిద్దిపేట పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు బస్సులు దగ్ధమయ్యాయి. పట్టణంలోని గంగాజల్ వాటర్ ప్లాంట్ సమీపంలో నిలిపిన... బ్రిలియంట్ స్కూల్ బస్సులకు ఎవరో నిప్పు పెట్టారని అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కరోనాతో కొన్ని నెలలుగా సెలవులు ఉన్నందున.. ఖాళీ స్థలంలో బస్సులు నిలిపారు. ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చూడండి: