రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాలను ఉడాన్ పథకంలో చేర్చాలని కేంద్ర విమానాయాన శాఖ నిర్ణయించింది. విజయనగరం జిల్లా బొబ్బిలి, ప్రకాశం జిల్లా దొనకొండ, పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న విమానాశ్రయాలు వినియోగంలో లేవు. వాటిని ఉడాన్ పథకంలో చేర్చాలని పౌర విమానయాన సంస్థ మంగళవారం దిల్లీలో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఉడాన్ లో చేర్చింది. కర్నూలు మినహా మిగిలిన మూడు విమానాశ్రయాలు బ్రిటీష్ కాలంలో ఏర్పాటు చేశారు. వాటిని వినియోగంలోకి తేవాలంటే పనులు చేపట్టాలి. మంగళవారం దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు పౌర విమానయాన శాఖ నిర్ణయించిందని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ తెలిపారు.
ఇదీ చదవండి : నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద తెదేపా నిరసన