ETV Bharat / city

పురందేశ్వరి ఆ ప్రయత్నాలు విరమించుకోవాలి:కొడాలి నాని - ఏపీ తాజా రాజకీయాలు

Kodali Nani: భాజపా నాయకురాలు పురందేశ్వరిపై వైకాపా మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని.. లేకుండా తీవ్ర పరిణామాలుంటాయని కొడాలి నాని హెచ్చిరించారు.

Kodali Nani
కొడాలి నాని
author img

By

Published : Jun 13, 2022, 7:26 PM IST

Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అన్న ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

‘‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్య అయిన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరు అయ్యాయి. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణం. ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటాం. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి. ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని కొడాలి నాని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.