ఉద్యోగాల కల్పనలో యువతను, నిరుద్యోగులను మోసగించిన ముఖ్యమంత్రే తొలి ముద్దాయి అని మాజీమంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. కేసులు, స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను విస్మరించిన జగన్ శిక్షార్హుడని ఆయన పేర్కొన్నారు. తమ భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టిన నిరుద్యోగులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్న ఆలపాటి ..వాటిని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 2.30లక్షల ఉద్యోగాల భర్తీ, సీపీఎస్ రద్దు హామీలతో యువతను, ఉద్యోగులను సీఎం మోసగించారని మండిపడ్డారు.
ఇదీ చదవండీ.. అప్పటివరకు ఎర్రకోట బంద్- కారణమిదే..