ETV Bharat / city

ఐపీఎస్ అధికారుల సంఘానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ! - ఏబీ వెంకటేశ్వరరావు తాజా వార్తలు

జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనకు పోస్టింగ్ ఇవ్వడం లేదని పేర్కొంటూ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం ఉందని లేఖలో పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. ఐపీఎస్ అధికారుల సంఘం తనకి వెన్నుదన్నుగా ఉంటుందని భావిస్తున్నట్లు లేఖ పేర్కొన్నారు.

AB Venkateswarao
AB Venkateswarao
author img

By

Published : Jan 5, 2021, 3:22 PM IST

ఐపీఎస్ అధికారుల సంఘానికి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనకు పోస్టింగ్‌ ఇవ్వలేదన్నారు. పోస్టింగ్‌ కోసం రెండుసార్లు ప్రభుత్వానికి లేఖ రాశానని పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులతో పాటు... విచారణలు కూడా లేవని తెలిపారు. ఆరోపణలతో ఇంతకాలం కొన్ని అభియోగాలు మోపి పోస్టింగ్‌ ఇవ్వలేదని ప్రస్తావించారు. పరికరాల కొనుగోలు అంశంపై 2020 ఫిబ్రవరి 2న డీజీపీ నుంచి మెమో వచ్చిందని వివరించారు. 2020 ఫిబ్రవరి 8 నుంచి తనను సస్పెన్షన్‌లో ఉంచారన్నారు.

"అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు...."

'సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ క్యాట్‌, హైకోర్టులో పిటిషన్‌ వేశా. 10 నెలల సస్పెన్షన్‌ తర్వాత నాపై ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జ్‌ జారీ చేశారు.నన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం ఉంది. ఈ అంశాలన్నీ ఐపీఎస్‌ అధికారుల సంఘం చర్చించాలని కోరుతున్నా. ఐపీఎస్‌ అధికారుల సంఘం నాకు వెన్నుదన్నుగా ఉంటుందని భావిస్తున్నా. ఐపీఎస్‌ అధికారుల సంఘం నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఆశించట్లేదు. కేవలం ప్రభుత్వం నుంచి వేధింపులు లేకుండా చూడాలన్నదే నా అభిమతం' - ఏబీ వెంకటేశ్వరారవు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్

ఇదీ చదవండి:

తాడిపత్రి వివాదంపై జగన్​ దృష్టి.. సీఎం క్యాంప్ కార్యాలయానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.