తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో చిరుత సంచరిస్తుందని అటవీశాఖ అధికారుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే డాక్టర్ రాకేష్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగిందని నెహ్రూ జూపార్క్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొలికొండ మండలం బురుగుపల్లి గ్రామానికి సమీపంలోకి తమ డాక్టర్ల బృందం చేరుకుని రెండేళ్ల నుంచి మగ చిరుతపులి అక్కడే సంచిరిస్తుందని గుర్తించిందని పేర్కొంది. కదలలేని స్థితిలో ఉన్న చిరుతకు మంచినీళ్లు అందించి కాస్త విశ్రాంతి కల్పించి... బోనులోకి పంపించామని అధికారులు తెలిపారు.
మేతకోసం వచ్చిన గేదెలపై చిరుతపులి దాడిచేసిందని స్థానికులు తెలిపారని అన్నారు. చిరుతకు లోపలి గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స అందించి... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ తీసుకొచ్చామన్నారు. వివిధ రకాల మందులతో తక్షణ ఉపశమనం కల్పించేలా చేశామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: HELPING: రాష్ట్రానికి 20 రోజుల్లో రూ.17కోట్లు సాయం: అర్జా శ్రీకాంత్