ETV Bharat / city

T20 World Cup 2021: హైదరాబాద్​లో తొలిసారి మల్టీప్లెక్స్‌ల్లో భారత్‌-పాక్‌ క్రికెట్​ మ్యాచ్​.. ఎక్కడెక్కడ అంటే? - INDIA PAK MATCH NEWS

ఈనెల 24న దుబాయ్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా క్రికెట్‌ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. సినిమాల స్థానంలో క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రేక్షకులు ఆస్వాదించనున్నారు.

T20 World Cup 2021
T20 World Cup 2021
author img

By

Published : Oct 23, 2021, 5:08 PM IST

చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్‌ క్రికెట్‌ మైదానంలో మరోసారి తలపడబోతున్నాయి. ఈనెల 24న దుబాయ్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం కావడంతో మ్యాచ్‌ వీక్షణకు నగరంలోని వాణిజ్య సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. తొలిసారిగా క్రికెట్‌ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. సినిమాల స్థానంలో క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రేక్షకులు ఆస్వాదించనున్నారు. ఈ ఏర్పాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. కప్‌ ఆఖరి దశలో మ్యాచ్‌లకల్లా అందుబాటులోకి రావచ్చని మల్టీప్లెక్స్‌ సిబ్బంది చెబుతున్నారు. ఎప్పటిలాగే రెస్టారెంట్లు, బార్లు పెద్ద తెరలతో క్రికెట్‌ వినోదం అందించేందుకు సర్వ సన్నద్ధం చేస్తున్నాయి.

  • జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లలో మ్యాచ్‌ వీక్షణ కోసం పెద్ద తెరలను ఏర్పాటు చేస్తున్నారు.
  • బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలిలోని పబ్‌లలోనూ మ్యాచ్‌ వీక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • హెచ్‌సీయూలో విద్యార్థి సంఘాల వారు సైతం భారీ స్క్రీన్‌లలో చూసేందుకుసిద్ధమవుతున్నారు.
...

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనున్న నేపథ్యంలో ట్యాంకుబండ్‌పై జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భారీ బ్యాట్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

T20 World cup: టీమ్‌ఇండియా ఏ రోజు ఏ జట్టుతో ఆడనుందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.