పశ్చిమగోదావరి జిల్లాలో...
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రులో లాక్డౌన్ పాటిస్తున్న తమ గ్రామ ప్రజలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో గ్రామస్థులకు చేపలు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు అందించారు. చేపలు పంచడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. తణుకు పాతఊరుకు చెందిన పరిమళ రావు, తోట ప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో పేదవారికి ఆహార పొట్లాలు అందజేశారు. తమ సేవా కార్యక్రమానికి రెవెన్యూ, పోలీసు అధికారులు అనుమతిచ్చారని తెలిపారు.
విజయవాడలో...
విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం ఆధ్వర్యంలో బ్రాహ్మణులు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్నన్ మల్లాది విష్ణు చేతుల మీదుగా సరకులు అందించారు.
విశాఖపట్నంలో ...
విశాఖపట్నంలోని రత్నగిరి కాలనీకి చెందిన రామచంద్రరావు.. స్థానిక ఆటో డ్రైవర్లకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. దాతలు ముందుకు వచ్చి ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని కోరారు.
నెల్లూరు జిల్లాలో ...
నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని ఆగిర్తికట్టవీధిలో గిరిజన కుటుంబాలకు తెదేపా నేతలు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలకు అండగా ఉండాలన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దాతలు తెలిపారు.
ఇదీ చదవండి..