ETV Bharat / city

హెచ్చరిక: ఆహార సంక్షోభం రాబోతోంది!

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తలకిందులయ్యాయి. నెలల తరబడి లాక్‌డౌన్ కారణంగా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎన్నో రంగాలు కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి. ఈ ప్రభావం ఆహారం భద్రతపైనా పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రపంచంలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.. ప్రపంచ దేశాలు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఐరాస విభాగమైన ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం-డబ్ల్యూఎఫ్​పీ అంచనాల ప్రకారం కరోనా వల్ల ప్రపంచం మొత్తం మీద అదనంగా 26.5 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

food crisis in near future in world wide
హెచ్చరిక: ఆహార సంక్షోభం రాబోతోంది!
author img

By

Published : Jun 11, 2020, 1:17 PM IST

కరోనా విలయం కొనసాగుతునే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. మరణాలూ లక్షల్లోనే ఉన్నాయి. ఈ మహమ్మారి ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో తెలియదు. కంటికి కనిపించని ఈ శత్రువు మానవాళి మనుగడకే సవాల్ విసురుతోంది. యావత్ ప్రపంచం కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. వాక్సిన్‌ వచ్చేంతవరకూ కరోనాతో కలిసి జీవించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ప్రపంచానికి మరో పెనుముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇప్పటికే ఉన్న ఆకలి కేకలకు తోడు రానున్న రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తే ముప్పు ఉందంటోంది ఐక్యరాజ్యసమితి.

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఏర్పడ్డ పరిస్థితులు ప్రపంచాన్ని ఆహార సంక్షోభం దిశగా తీసుకు వెళ్తున్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 820 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపింది. వీరిలో 144 మిలియన్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులేనని పేర్కొంది. ప్రస్తుతం 780 కోట్ల ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని అయితే, వాటిని క్షేత్ర స్థాయికి చేర్చడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

అత్యవసర జాబితా కింద ఆహారం

ఆహార కొరత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య మరింత పెరగనుందని తెలిపింది ఐక్యరాజ్యసమితి. పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులకు పౌష్టికాహారం తప్పక అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచించించింది. వ్యవసాయ, ఆహార సంబంధిత సేవల్ని అత్యవసర జాబితా కింద గుర్తించాలని తద్వారా... ఆయా రంగాల్లో పని చేసేవారికి రక్షణ కల్పించాలని తెలిపింది. ఆహార శుద్ధి, రవాణా సేవలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ప్రపంచంలోనే ఎక్కువ

ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న వారికి తోడుగా 26.5కోట్ల మంది ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని అంటోంది.. సెంటర్ ఫర్‌ సైన్స్‌ అండ్ ఎన్విరాన్ మెంట్ సంస్థ. భారత్‌లో కోటీ 20 లక్షలమంది అదనంగా పేదరికంలో కూరుకుపోనున్నారని వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే ఎక్కు వ. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్ మెంట్‌ ఇన్ ఫిగర్స్‌ పేరుతో విడుదలైవ వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో దారిద్ర్యం మరింత పెరగనుంది. గత 22 ఏళ్ల కాలంతో చూసుకుంటే ఇదే అత్యధికం. ప్రపంచ జనాభాలో సగం కన్నా ఎక్కువ మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు. వీరికి అతితక్కువ, మొత్తానికే ఆదాయం పోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 40 నుంచి 60 మిలియన్ల ప్రజలు కటిక దారిద్ర్యంలో నివసించాల్సి వస్తోంది.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అల్లాడే వారి సంఖ్య పెరగనుందని ఆహార కార్యక్రమాల్లో ఐరాసకు సహకారం అందించే డబ్ల్యూఎఫ్​పీ ఏప్రిల్‌లోనే హెచ్చరించింది. 2020 ఏడాదిలో రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితుల కన్నా మరింత ఘోరంగా ఉండనున్నాయని తెలిపింది.

కరోనాతో రెట్టింపు

ప్రస్తుతం ప్రపంచం కరోనాతోనే పోరాడటం లేదని.. మానవతా సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వివిధ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా ఆహార సంక్షోభంపై వెలువరించిన నివేదిక ప్రకారం మరో పదమూడున్నర కోట్ల మంది ఆకలిబారిన పడనున్నారు. కరోనా మహమ్మరి ప్రభావం కారణంగా అది రెట్టింపు కానుంది.

తక్షణ చర్యలు అవసరం

కరోనా కారణంగా అనేకదేశాలలో కరవు వచ్చే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది డబ్ల్యూఎఫ్​పీ. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 30కి పైగాదేశాలలో ఎక్కువకాలం ఆ ప్రభావం వెంటాడకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులతో ప్రభావితమైన 10దేశాల్లో ఎక్కువ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూఎఫ్​పీ తెలిపింది. యెమెన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సుడాన్, సిరియా, నైజీరియా, హైతీ దేశాలు అత్యంత ప్రభావితమైనవిగా పేర్కొంది. దక్షిణ సూడాన్‌లో 61% జనాభా గతేడాది ఆహార సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహమ్మారికి ముందు తూర్పు ఆఫ్రికా , దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఆహార సంక్షోభం ఉంది.

రోజుకు 3 లక్షల మంది!

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ కార్యక్రమాల ద్వారా 10 కోట్లమందికి ఆహారం అందిస్తోంది . ప్రస్తుతం ఆ ఆహారంపైనే ఆధారపడి ఉన్నవారు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లమంది వరకూ ఉన్నారు. కరోనా కారణంగా ఆహారాన్ని క్షేత్రస్థాయికి చేర్చడంలో వ్యవస్థలు విఫలమవడం వల్ల చాలా మందిపై ప్రభావం చూపించింది. తమపైనే ఆదారపడిన 3 కోట్లమంది ప్రాణాలు నిలబెట్టే చర్యలు తీసుకోకపోతే రోజుకు 3 లక్షలమంది చొప్పున మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది డబ్ల్యూఎఫ్​పీ.

ఇవీ చదవండి...

ఒంగోలు కుర్రోడు.. ఊళ్లోనే కంపెనీ పెట్టేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.