ETV Bharat / city

నకిలీ పత్రాలతో ఖాళీగా ఉన్న భూముల విక్రయాలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు

Land Grabbing With Fake Documents: భూమిని కొనుక్కున్నాం.. ఎక్కడకి పోదు అని అనుకుంటే పొరపాటు. ఖాళీగా, పర్యవేక్షణ లేకున్నా స్థలాలకు నకిలీ పత్రాలు తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు.. యజమానికి తెలియకుండానే భూములు అమ్మేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు.

నకిలీ పత్రాలతో భూములు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

author img

By

Published : Oct 19, 2022, 10:27 AM IST

నకిలీ పత్రాలతో భూములు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

Land Grabbing With Fake Documents: తెలంగాణలోని హైదరాబాద్‌ శివారులో భూముల ధరలు పెరగడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి విక్రయాలకు పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సమీపంలోని పసుమాములలో 368, 369, 370 సర్వే నెంబర్లలో 150 గజాల స్థలం కొనుగోలు చేశాడు. అయితే కొన్నిరోజుల క్రితం.. సందీప్‌కుమార్, అజయ్, చంద్రశేఖర్‌, తరుణ్ కుమార్, రామారావు మరికొందరు కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వారికి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి భారీగా నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా స్థిరాస్తి దళారులుగా గుర్తించారు. ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని అమ్మి సులభంగా డబ‌్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మన్సూరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్​ హయత్​నగర్‌లోని 368 నుంచి 371 సర్వే నెంబర్లలోని స్థలం చాలా కాలంగా పర్యవేక్షణ లేకుండా ఉన్నట్లు గుర్తించాడు.

ఇందుకు సంబంధించిన సేల్‌డీడ్ సర్టిఫైడ్ కాపీని సందీప్‌కుమార్‌కు ఇచ్చాడు. అతను నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడంలో దిట్ట. గతంలో ఇదే తరహా కేసులో అరెస్టైన సందీప్.. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత అజయ్‌తో కలిసి సందీప్ నకిలీ సేల్‌డీడ్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. వాటిపై నకిలీ రెవెన్యూ స్టాంపులను వేసి అసలైన డాక్యుమెంట్ల మాదిరిగా సిద్ధం చేశాడు.

వాటిని మరో నిందితుడు తరుణ్‌కుమార్‌కు ఇవ్వగా స్థలాన్ని కొనే పార్టీ కోసం వెతికాడు. ఆ తర్వాత స్థలానికి అసలైన యజమానుల వ్యక్తిగత వివరాలు సేకరించి.. వారి స్థలంలో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేస్తారు. వారి పేరుతో ఇతరుల ఫోటో పెట్టి ఆజయ్‌ ఆధార్‌ కార్డులు సృషిస్తాడు. వారికి బొమ్మరామారావు అనే మరో నిందితుడు పాత నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు, రబ్బరుస్టాంపులు సమకూర్చాడు. ఆ విధంగా ఐదుగురు కలిసి భూమిని అమ్మేందుకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితులపై గతంలోనూ భూకబ్జాలకు సంబంధించిన కేసులున్నాయని అధికారులు తెలిపారు. అరెస్టై విడుదలైనా మళ్లీ ఇదే దందా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వరుస నేరాలకు పాల్పడుతున్న వారిపై త్వరలో పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.