హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యింది. షాలిమర్తో పాటు పక్కనే ఉన్న ప్రదీప్ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దుకాణంలో ఉన్న ఫర్నిచర్ అంతా అగ్నికి ఆహుతైంది.
ప్రమాదానికి గల కారణాలను.. ఆస్తి నష్టాన్ని, అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: ఆ వాహనాల విడుదలపై డీజీపీ కోర్టుకు హాజరుకావాలి: హైకోర్టు