ETV Bharat / city

ఫార్ములా ఈ-రేసింగ్​​కు ఏర్పాట్లు.. దేశంలోనే తొలిసారిగా..! - దేశంలోనే తొలిసారి హైదరాబాద్​లో ఫార్ములా ఈ రేసింగ్​​

Formula E Racing in Hyderabad: ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్​కు తెలంగాణ రాజధాని హైదరాబాద్​ సన్నద్ధమవుతోంది. భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా 2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్​కు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

rasing
rasing
author img

By

Published : Jul 11, 2022, 10:48 PM IST

Formula E Racing in Hyderabad: భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్​కు ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ఈవెంట్ జరగనుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్​పై ఈవెంట్ జరగనుంది. ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

ఈవెంట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈఓ దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉంటారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎక్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎక్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.