ETV Bharat / city

బీమా పరిహారంలో అక్రమాలు.. ఆగ్రహంతో భరోసా కేంద్రానికి తాళం

Irregularities in crop insurance: పంటల బీమా పరిహారం చెల్లింపులో అక్రమాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులను కాదని వైకాపాకు చెందిన అనర్హులకు బీమా పరిహారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అన్నివిధాలా నష్టపోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు.. జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై రగిలిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల రైతు భరోసా కేంద్రానికి, సచివాలయానికి తాళం వేశారు.

farmers fires distribution of compensation

author img

By

Published : Jun 17, 2022, 7:35 AM IST

farmers angry over irregularities in compensation distribution: పంటల బీమా నమోదు, నష్ట పరిహారం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల, అర్ధవీడు మండలం మాగుటూరులో గురువారం రైతు భరోసా కేంద్రానికి, సచివాలయానికి తాళం వేశారు. ముండ్లమూరులో ఏవో శ్రీధర్‌, వీఏఏ బాలవెంకటయ్యలతో వాదనకు దిగారు. జామాయిల్‌ సాగు చేసిన రైతుల పేరిట మిర్చి వేసినట్లు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఏవో వారితో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా వారు శాంతించలేదు. మాగుటూరులో బసిరెడ్డిపల్లి, సుగాలితండా, మాగుటూరు బీసీ కాలనీల రైతులు సచివాలయాన్ని ముట్టడించి, భవనానికి తాళం వేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పి తాళం తీయించారు.

పరిహారం దక్కలేదని నిరసన : కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం ఊడిమూడిలో 439 మంది రైతులు 530 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో వీరు వేసిన పంటలు దెబ్బతిన్నాయి. అయినా ఒక్కరికీ పంటల బీమా పరిహారం రాలేదు. దీనిపై మండల వ్యవసాయాధికారి ఎన్‌.సత్యప్రసాద్‌ మాట్లాడుతూ... ఊడిమూడి గతంలో కోటిపల్లిలో అంతర్గతంగా ఉండేదన్నారు. పంచాయతీగా విభజన జరిగాక గ్రామంలో పంటకోత ప్రయోగాలు చేసేందుకు అనుమతులు రాలేదన్నారు. ఈ ప్రయోగాలు జరగకుంటే బీమా పరిహారం మంజూరు కాదన్నారు.

గాలివీడులో అధికారులపై మండిపాటు : పంటల బీమా మంజూరులో అక్రమాలు జరిగాయంటూ అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు రైతులు సచివాలయానికి తాళం వేశారు. ఉద్యోగులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంపీడీవో వచ్చి సర్దిచెప్పినా వినలేదు. 340 మంది రైతులకు సుమారు రూ.30 లక్షలు బీమా కింద విడుదల చేశారని, అందులో ఎక్కువ అక్రమాలు జరిగాయని మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి చిన్నరెడ్డి ఆరోపించారు.

నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం- మంత్రి కాకాణి: రైతులకు పంట నష్టపరిహారంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో గురువారం ఆయన మాట్లాడుతూ.. "గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పారదర్శకంగా బీమా పథకాన్ని ఉచితంగా అమలు చేస్తున్నాం. 31 పంటల్లో అయిదింటికి నష్టం జరగలేదని అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులందరికీ రూ.3వేల కోట్లను నష్టపరిహారంగా అందిస్తున్నాం" అని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.