అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన షేక్ కరీముల్లా.. ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి నిర్మాణానికి షేక్ కరిముల్లా 46 సెంట్లు పొలం ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన దగ్గర్నుంచి ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. 400 రోజులుగా నిర్వహించిన ర్యాలీలో కరిముల్లా ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం సైతం ధర్నాలో పాల్గొన్న ఆయన మృతితో తోటి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కరిముల్లా
త్యాగం వృథా కానివ్వబోమని రైతులు తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: