తెలంగాణలోని జోగులాంబ జిల్లా గద్వాలలో పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శ్రీనివాస థియేటర్లో వేశారు. ఈ సందర్భంగా బెనిఫిట్‌షోలో సినిమా బ్లర్ కావడం, సిగ్నల్ సమస్య తలెత్తింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో థియేటర్ ముఖద్వారంపై దాడి చేశారు. ద్వారం పాక్షికంగా ధ్వంసమైంది.
అదే సమయంలో టికెట్లు దొరకని పలువురు థియేటర్లోకి దూసుకురావడం వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థియేటర్ యాజమాన్యం సర్ది చెప్పడంతో సమస్య సద్దు మణిగింది. అభిమానులు థియేటర్ వద్ద బాణా సంచా కాల్పులతోపాటు డప్పుల వాయిద్యంతో సందడి చేశారు. మరోవైపు అభిమానులు కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి నృత్యాలు చేయడంపై ప్రజలు విస్మయానికి గురయ్యారు.
ఇదీ చదవండీ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా: శైలజానాథ్