కరోనా ఆ కుటుంబాన్ని చిదిమేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో కరోనా పంజాకు ఒకరి తర్వాత ఒకరు.. అయిదు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. బోథ్‌లో ఈ నెల 1న కుటుంబ పెద్ద మెరుగు నర్సయ్య(65) బలికాగా, ఆయన చిన్న కుమారుడు మెరుగు చిన్ననర్సయ్య(34) నిర్మల్‌లో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.
ఈ విషాదం నుంచి కోలుకోక ముందే నర్సయ్య భార్య మెరుగు లక్ష్మి(58) నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. చిన్ననర్సయ్య భార్య సైతం కరోనా బారిన పడి నిర్మల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: 'కరోనాకు చికిత్స : లాయర్లకు నగదు రహిత వైద్యానికి ' రక్ష ' ఒకే'