రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు సహా... అమరావతి విషయంలో దేశంలోనే పేరొందిన న్యాయకోవిదులు రైతుల పక్షాన నిలిచారని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. హైకోర్టును కాపాడుకునేందుకు వారంతా ముందుకు వచ్చారన్నారు. అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో జరిగిన విచారణలో వారు పాల్గొనటాన్ని లక్ష్మీనారాయణ స్వాగతించారు.
సుమారు 50కు పైగా దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించిందని అడ్వొకేట్ లక్ష్మీనారాయణ తెలిపారు. కేవలం క్యాంపు ఆఫీసు మాత్రమే విశాఖకు తరలిస్తామని ప్రభుత్వం వాదనలు వినిపించినా.... కోర్టు పరిగణలోకి తీసుకోలేదనని చెప్పారు. స్టేటస్ కోను పొడిగించవద్దని ప్రభుత్వం కోరినా...కోర్టు తిరస్కరించిందని తెలిపారు. తప్పనిసరిగా కోర్టు తీర్పు... రైతులకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసు తదుపరి విచారణ ఈనెల 27న జరగనుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి