ETV Bharat / city

మరింత కాలం 'ఆన్​లైన్​లోనే​ విచారణ'.. గడువు పెంచిన హైకోర్టు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు కోర్టులో అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13 వరకే ఉన్న గడువును కరోనా వ్యాప్తి దృష్ట్యా పొడిగించారు.

Extension of time for high court online hearing

author img

By

Published : Jul 14, 2020, 12:53 AM IST

Updated : Jul 14, 2020, 2:40 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆన్​లైన్​లో అత్యవసర కేసులు విచారించాలని నిర్ణయించిన హైకోర్టు ఆ గడువును పెంచింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 3 వరకు అత్యవసర కేసులను హైకోర్టుతో పాటు దాని నియంత్రణలో పనిచేసే ఏపీ న్యాయ సేవాధికార సంస్థ , హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ , మధ్యవర్తిత్వ కేంద్రాల్లో విచారణలు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు . అన్ని తరహా వ్యాజ్యాలను ఈ - ఫైలింగ్ విధానంలోనే దాఖలు చేయాలన్నారు.

ఇంటివద్ద నుంచే విచారణలు కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తులు భావిస్తే ఆ విధానాన్నే అనుసరించొచ్చని తెలిపారు. జూన్ 24 నుంచి దాఖలైన వ్యాజ్యాలను వరుస క్రమంలో విచారణకు తీసుకుంటారన్నారు . అత్యవసరం ఉన్న కేసుల్లో దరఖాస్తు దాఖలు చేసుకుంటే హైకోర్టు సీజే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

స్టాండింగ్ కౌన్సిళ్ల రాజీనామాలు ఆమోదం

హైకోర్టులో పనిచేసే ముగ్గురు స్టాండింగ్ కౌన్సిళ్ల రాజీనామాలను ఆమోదిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి. మనోహరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు . రాజీనామా చేసిన వారిలో శీలం శివకుమారి, కె. నర్సిరెడ్డి, జె.సుమతి ఉన్నారు . వీరు ఇటీవల ప్రభుత్వ న్యాయవాదులు ( జీపీ ) లుగా నియమితులయ్యారు.

ఇదీ చదవండి:

ఎంసెట్ సహా...పలు ప్రవేశ పరీక్షలు వాయిదా: మంత్రి సురేశ్‌

Last Updated : Jul 14, 2020, 2:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.