ఆర్‌అండ్‌బీ నిబంధనల ప్రకారం ఒక వరుస రహదారిని రెండు వరుసలుగా విస్తరించేందుకు కిలోమీటరుకు రూ.కోటి నుంచి రూ.1.2 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఎన్‌డీబీ రుణంతో చేపట్టే రహదారుల పనుల్లో.. ముందుగా వేసిన అంచనా కంటే దాదాపు 500 కి.మీ. మేర విస్తరణ పనులు తగ్గనున్నాయి. ఎన్‌డీబీ నిబంధనల ప్రకారం అది రూ.2 కోట్ల నుంచి రూ.2.2 కోట్ల వరకు అవుతుందని పేర్కొంటున్నారు. దీంతో మొత్తం 3,100 కి.మీ. పొడవున విస్తరించాలనుకున్న రహదారుల్లో 500 కి.మీ. తగ్గనున్నాయి. ఇప్పటికే మొదటి దశలో రూ.2,978 కోట్ల అంచనా వ్యయంతో 1,243 కి.మీ. మేర రోడ్ల విస్తరణకు టెండర్లు పిలిచి, గుత్తేదారు సంస్థలకు పనులు అప్పగించారు.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని అప్పీలు