ETV Bharat / city

Banjarahills pub case: పబ్‌లో తరచూ డ్రగ్స్‌ పార్టీలు.. హై ప్రొఫైల్‌ అతిథులు - ts news

Banjarahills pub case: బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో నాలుగో నిందితుడిగా కిరణ్‌రాజ్‌ పేరును చేర్చారు. పబ్‌ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న ఆబ్కారీ శాఖ.. పబ్‌లపై మరింత నిఘా పెంచాలని నిర్ణయించింది. రాడిసన్‌ హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వారాంతాల్లో అక్కడ మత్తు పార్టీలు కొనసాగుతుంటాయని పోలీసులు గుర్తించారు. అతిథులంతా హైప్రొఫైల్‌ ఉన్నవారని పలువురు పోలీసు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. వారాంతాల్లో 30-40 మంది వచ్చి డ్రగ్స్‌ తీసుకుంటారని వివరించినట్లు సమాచారం.

Banjarahills pub case
Banjarahills pub case
author img

By

Published : Apr 5, 2022, 10:29 AM IST

పబ్‌లో తరచూ డ్రగ్స్‌ పార్టీలు.. హై ప్రొఫైల్‌ అతిథులు

Banjarahills pub case: రాడిసన్‌ పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తోంది. మత్తు పార్టీలుంటాయని తెలిసే కొందరు అక్కడికి వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో స్వాధీనం చేసుకున్న 5 గ్రాములతో పాటు మరికొంత కొకైన్‌ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ తరచూ డ్రగ్‌ పార్టీలు కొనసాగుతుంటాయని, అతిథులు కూడా హైప్రొఫైల్‌ ఉన్నవారేనని పలువురు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. వారాంతాల్లో 30-40 మంది వరకు వచ్చి కొకైన్‌ తీసుకుంటారని వివరించినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లో అక్రమాలకు బాధ్యుడిగా, నాలుగో నిందితుడిగా హైదరాబాద్‌లో ఉంటున్న కిరణ్‌రాజ్‌ పేరును సోమవారం చేర్చారు. కొన్నేళ్ల నుంచి పబ్‌ను నిర్వహిస్తున్న కిరణ్‌రాజ్‌ నాలుగేళ్ల క్రితం అభిషేక్‌ ఉప్పలకు లీజుకు ఇచ్చాడు. అయినా భాగస్వామిగానే కొనసాగుతున్నాడు. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు అతని పేరు నమోదు చేశారు. కిరణ్‌రాజ్‌ ఓ జాతీయ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి అల్లుడని సమాచారం. రాజకీయ నేతలు, ప్రముఖులతో అతడికున్న సంబంధాలు, పలుకుబడికి భయపడి ఎక్సైజ్‌శాఖ, పోలీసులు తనిఖీలకు వెళ్లలేదని తెలిసింది. ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో బంజారాహిల్స్‌ పోలీసులు 2019లో ఒకసారి, 2021లో మరోసారి సమయానికి మించి మద్యం అమ్ముతున్నారంటూ కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసులు అరెస్టు చేసిన అనిల్‌కుమార్‌, అభిషేక్‌లను కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆ ఇద్దరినీ వారంపాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు.

ల్యాప్‌టాప్‌, ఫోన్‌ స్వాధీనం: పబ్‌పై ఆదివారం పోలీసుల దాడి సమయంలో మేనేజర్‌ అనిల్‌కుమార్‌, పబ్‌ భాగస్వామి అభిషేక్‌ ఉప్పలను విచారిస్తుండగా... పార్టీకి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని ప్రశ్నించారని, ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అతను గోవాకు తరచూ రాకపోకలు కొనసాగిస్తున్నాడని, ఆ వ్యక్తికి కొకైన్‌ సరఫరాకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. పార్టీకి వచ్చిన కొందరు ఆ వ్యక్తి పక్కనే కూర్చున్నారు. కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పబ్‌కు వచ్చిన వారిలో ఒక యువకుడిపై రెండుసార్లు డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయని, అతడితో పాటు ఇద్దరు అమ్మాయిలు పార్టీకి వచ్చారని సమాచారం. వీరిద్దరికీ 20 ఏళ్లే ఉన్నా పబ్‌లోకి అనుమతించారని, ఆబ్కారీ చట్టం ప్రకారం 21ఏళ్లకు తక్కువ ఉన్నవారికి మద్యం సరఫరా చేయరాదు. వీరు మైనర్లని అధికారులు చెప్పారు.

రోజంతా మద్యం, అర్ధరాత్రి దాటాక మాదకద్రవ్యాలు: వారాంతాల్లో పామ్‌ (పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌) యాప్‌లో నమోదు చేసుకున్నవారికి 24 గంటల పాటు మద్యం, అర్ధరాత్రి దాటాక మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారని తెలిసింది. సాధారణ రోజుల్లో వెళ్లాలనుకునేవారికి అప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తేనే అనుమతించేవారు. ఇదంతా మేనేజర్‌ అనిల్‌కుమార్‌ కనుసన్నల్లో జరుగుతోంది. గతేడాది ఆగస్టు నుంచి ఇతను ఈ పబ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఓ బ్రూవరీస్‌ కంపెనీలో పనిచేస్తున్న అనిల్‌ను అర్జున్‌ వీరమాచనేని ఈ పబ్‌కు తీసుకువచ్చాడు. నిర్వాహకులకున్న పరిచయాలతో ప్రముఖులు, సెలబ్రిటీల కుమారులు, కుమార్తెలు, మాజీ పోలీస్‌ అధికారి కుమార్తె, సినిమాల్లో పనిచేస్తున్న వారిలో కొందరు రెగ్యులర్‌ కస్టమర్లుగా మారారు.

24 గంటల అనుమతి ఉంటుందా?: పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించిన అనంతరం పబ్‌ తరఫున కొందరు ప్రతినిధులు తమకు 24 గంటలూ బార్‌, పబ్‌ నిర్వహించుకునేందుకు అనుమతులున్నాయంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబందించి ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన అనుమతి పత్రాలను కూడా చూపించారు. పరిశీలించిన పోలీస్‌ అధికారులు ఇవి 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆబ్కారీశాఖ ఇచ్చినవి గుర్తించారు. వాటిని రెన్యువల్‌ చేసుకుంటున్నారని తెలుసుకున్నారు. అందులో కొన్ని నిబంధనలను పరిశీలించగా కొన్ని పరిమితులకు లోబడి మద్యం సరఫరా చేయవచ్చన్న అంశం ఉందని, మద్యంతోపాటు భోజనం, ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు అనుమతులు లేవని తెలుసుకున్నారు. వీటిపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో చర్చించి పబ్‌ నిర్వాహకులు చెప్పినదాంట్లో తప్పులుంటే మరో కేసు నమోదు చేయనున్నారు.

రాడిసన్‌ బ్లూ ప్లాజా బార్‌, పబ్‌ లైసెన్స్‌ రద్దు: రాడిసన్‌ బ్లూ ప్లాజా బార్‌, పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ రెండింటి లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరు 30, 2022 వరకూ 24 గంటలు మద్యం విక్రయించేందుకు ఈ ప్లాజాలోని బార్‌ రూ.56,66,700 అదనపు ఫీజు చెల్లించి అనుమతి తీసుకుంది. ఇదే అనుమతితో పబ్‌లో మద్యం విక్రయిస్తుండడమే కాకుండా, డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు గుర్తించి లైసెన్స్‌ రద్దు చేశారు.

కఠిన చర్యలకు వెనకాడబోం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రంలో మత్తుమందులను నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు పాటించని పబ్బులు, బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే రాడిసన్‌ బార్‌ లైసెన్స్‌ రద్దు చేశామన్నారు. ఆబ్కారీశాఖను బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఇటీవల పెద్దఎత్తున పదోన్నతులు ఇచ్చామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: Radisson Blu Pub: రాడిసన్ బ్లూ పబ్‌ లైసెన్స్ రద్దు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.