ETV Bharat / city

EX MINISTER SOMIREDDY: 'హైకోర్టే నమ్మట్లే.. పోలీసు వ్యవస్థకు ఇక విలువేముంది?' - tdp and ycp war

పోలీసు వ్యవస్థపై ఏపీ హైకోర్టు తీవ్రమైన అభిశంసన చేసిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. హైకోర్టే పోలీసులపై నమ్మకం కోల్పోయాక.. ఇక పోలీసుల వ్యవస్థకు విలువేముంటుందని ప్రశ్నించారు.

EX MINISTER SOMIREDDY COMMENTS ON HC VERDICT ON POLICE DEPARTMENT
'హైకోర్టే నమ్మట్లే.. పోలీసు వ్యవస్థకు ఇక విలువేముంటుంది'
author img

By

Published : Oct 24, 2021, 2:22 PM IST

పోలీసు వ్యవస్థపై రాష్ట్ర హైకోర్టు తీవ్రమైన అభిశంసన చేసిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. "ముఖ్యమంత్రికి ఒక చట్టం.. న్యాయమూర్తులకు మరో చట్టమా?" అనే ప్రశ్న లేవనెత్తిందని గుర్తుచేశారు.

హైకోర్టే పోలీసులపై నమ్మకం కోల్పోయిన తర్వాత.. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థకు ఇక విలువ ఏముంటుందని ప్రశ్నించారు. ఇంత తీవ్రమైన అభిసంసనకు కూడా డీజీపీ స్పందించకుండా అదే సీటులో కొనసాగడం.. పోలీసు శాఖ ప్రతిష్ఠకే మాయనిమచ్చ అని చెప్పారు. ఈ మేరకు సోమిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పటికైనా డీజీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.