మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి.. తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో తన భూమిలో నుంచి కాల్వ తవ్వొద్దంటూ ఇంజినీర్తోపాటు... అక్కడ పనిచేస్తున్నవారిని బెదిరించారు. సర్వే ప్రకారం.. పిల్లాయపల్లి కాల్వను ఆయన భూమి మీదుగా తవ్వుతున్న సమయంలో... ఈ ఘటన జరిగింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆదేశాలతో... ఆయుధ చట్టం, ఇతర సెక్షన్ల కింద చిట్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత ఇంజినీర్ ఫిర్యాదుతో మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
నెలరోజులే మంత్రిగా..
1978, 1983.. రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందిన గుత్తా మోహన్ రెడ్డి... నాదెండ్ల భాస్కర్రావు హయాంలో నెలరోజుల పాటు మంత్రిగా పని చేశారు.
ఇవీచూడండి: ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం