ETV Bharat / city

మళ్లీ లాక్‌డౌన్‌ అవసరం ఉండదు: హోంమంత్రి సుచరిత - Home Minister Sucharitha News

కరోనా టీకాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని.. హోంమంత్రి సుచరిత సూచించారు. కరోనా టీకా తీసుకునేందుకు ఎవరూ భయపడవద్దని కోరారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అవసరం లేదని భావిస్తున్నామని స్పష్టం చేశారు.

హోంమంత్రి సుచరిత
హోంమంత్రి సుచరిత
author img

By

Published : Mar 27, 2021, 5:39 PM IST

Updated : Mar 27, 2021, 8:36 PM IST

హోంమంత్రి సుచరిత

ఏడాది క్రితం రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు దానికి సరైన చికిత్సా విధానం తెలియకపోవడంతో లాక్‌డౌన్ పెట్టాల్సి వచ్చిందని.. ఇప్పుడు టీకా అందుబాటులోకి రావడంతో లాక్‌డౌన్ అవసరం లేదని భావిస్తున్నట్లు మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని.. కరోనా టీకా తీసుకునేందుకు ఎవరూ భయపడొద్దని చెప్పారు. టీకాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 45 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే కరోనా కట్టడి సాధ్యమన్నారు. రాష్ట్రంలో కోటి మందికి టీకా ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందుకు తగ్గట్టుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతం చేస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది కాలంగా మాస్కులు లేకుండా బయటకు వచ్చిన 80 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండీ... రాష్ట్రాలకు దన్ను: 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు

Last Updated : Mar 27, 2021, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.