- కర్ఫ్యూ పొడిగింపు .. ఆ సమయంలో బయటికొస్తే చర్యలు!
కరోనా రెండో దశ ఉద్ధతి దృష్ట్యా.... రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆధార్ లేకుండానే వృద్ధులకు టీకా.. ప్రభుత్వం నిర్ణయం
వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని మాటిచ్చారు.. అమలు చేయండి'
వృద్ధ్యాప్య పింఛన్లు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ.. సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. వృద్ధాప్య పింఛను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భర్తతో గొడవ.. ఐదుగురు కుమార్తెలతో తల్లి రైలు కిందపడి
ఛత్తస్‌గఢ్‌లో ఓ మహిళ, తన ఐదుగురు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవ పడిన కారణంగానే మహిళ ఈ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వేలి గోళ్లు రంగు మారుతున్నాయా?
కరోనా వైరస్(Corona Virus) బారిన పడితే సాధారణంగా జ్వరం, దగ్గు, వాసన కోల్పోవటం వంటివి కనిపించే లక్షణాలు. తాజాగా..కొవిడ్ బారినపడిన రోగుల్లో వేలి గోళ్లు రంగు మారటం, ఆకృతిలో మార్పు వంటివి గుర్తించారు శాస్త్రవేత్తలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బిహార్‌లో లెక్కకు మించిన మరణాలు 72శాతం!
సవరించిన కొవిడ్ మృతుల సంఖ్యను బిహార్ ప్రభుత్వం వెల్లడించగా ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏకంగా 72శాతం అధికంగా మరణాలు నమోదయ్యాయి. అయితే ఈ మరణాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tiktok: చైనా యాప్‌పై నిషేధం ఎత్తివేత!
చైనాకు చెందిన టిక్‌టాక్, విచాట్ యాప్‌లపై విధించిన నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కార్ల విక్రయాలు 59శాతం డౌన్!
కరోనా తొలి దశ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వాహన విక్రయాలు మరోసారి భారీగా క్షీణించాయి. కొవిడ్ రెండో దశ విజృంభణతో మేలో 85,733 కార్ల రిటైల్ విక్రయాలు మాత్రమే నమోదైనట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. ఏప్రిల్‌తో పోలిస్తే ఈ విక్రయాలు 59 శాతం తక్కువ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత మృతి
బాక్సింగ్‌లో ఆసియా క్రీడల బంగారు పతత విజేత డింకో సింగ్(42) మృతిచెందారు. సుదీర్ఘంగా కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలయ్యకు ఆ రూమ్ అంటే సెంటిమెంట్!
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కొన్ని సెంటిమెంట్లను బలంగా నమ్ముతారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని రూమ్ నంబర్ 610తో కూడా బాలయ్యకు బలమైన బంధం ఉంది. ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగితే బాలయ్య ఆ రూమ్‌లో తప్ప మరో రూమ్‌లో ఉండరట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.